Drugs | గాంధీనగర్: గుజరాత్లో మళ్లీ పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆదివారం రాష్ట్రంలోని అంకలేశ్వర్ పట్టణంలో రూ.5 వేల కోట్ల విలువైన కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఢిల్లీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఇక్కడి ఆవ్కార్ డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీ ఆవరణలో 518 కిలోల డ్రగ్స్ పట్టుకున్నారు. దీనికంటే ముందు ఢిల్లీలో పోలీసులు చేపట్టిన రెండు వేర్వేరు ప్రత్యేక ఆపరేషన్స్‌లో 700 కిలోల డ్రగ్స్ బయటపడింది.