Vehicles Pileup | ఢిల్లీ – మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా దాదాపు 50 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (Vehicles Pileup). ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్ సమీపంలోని ఢిల్లీ – మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (Delhi Meerut Eastern Peripheral)పై బుధవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలోని మీరట్ – ఘజియాబాద్ క్యారేజ్‌వేలో హవా హవాయ్ రెస్టారెంట్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా దాదాపు 30 నుంచి 35 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.
ఆ తర్వాత బాగ్పట్ – దుహై క్యారేజ్‌వేపై (Baghpat-Duhai carriageway) 20 నుంచి 25 కార్లు ఢీ కొన్నాయి. రెండు ప్రమాదాలూ దట్టమైన పొగమంచు కారణంగానే జరిగినట్లు పోలీసులు తెలిపారు. విజిబిలిటీ సరిగా లేకపోవడంతోనే ప్రమాదాలు సంభవించినట్లు చెప్పారు. ఈ రెండు ఘటనల్లో ఐదుగురికి గాయాలైనట్లు చెప్పారు. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పోలీసులు వెల్లడించారు.
Also Read..
Stampedes | 1954 నుంచి 2025 వరకు.. కుంభమేళాలో ‘మహా’ విషాదాలు..!
PM Modi: ప్రయాగ్‌రాజ్ ఘటన చాలా బాధాకరమైంది: ప్రధాని మోదీ