Accident | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. చిదంబరం వద్ద ఓ లారీ.. ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలాడుతురైకి చెందిన 56 ఏళ్ల మహ్మద్ అన్వర్ తన కుటుంబంతో కలిసి చెన్నైలోని తమ బంధువులను కలిసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పి ముట్లూరు వంతెనపై వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను మహ్మద్ అన్వర్, యాసర్ అరాఫత్, ఇద్దరు మహిళలు హజీరా బేగం, హరాఫత్నీషా, మూడేళ్ల బాలుడు అబ్నాన్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Killer wolfs | ఒంటరి తోడేలు కోసం కొనసాగుతున్న గాలింపు.. మరో మహిళపై దాడి
PM Modi | సీజేఐ ఇంట గణపతి పూజ.. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న ప్రధాని మోదీ
KTR | కేసీఆర్ రైతును రాజు చేస్తే.. రేవంత్ రైతు ప్రాణాలను తీస్తున్నాడు : కేటీఆర్