Rahul Gandhi | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) బీజేపీ (BJP) విద్వేషాన్ని, అవినీతిని ప్రజలు ఓడించారని కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఎన్నికలకు ముందు తమ పార్టీ ఇచ్చిన ఐదు హామీలపై (5 Guarantees) మరికొన్ని గంటల్లో జరగబోయే మొదటి కేబినెట్ సమావేశం (first cabinet meeting)లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. బెంగళూరులోని కన్నడ కంఠీరవ స్టేడియంలో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ( Siddaramaiah), ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar ) ప్రమాణస్వీకారం చేశారు. వారితోపాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని, వారి అవినీతిని, విద్వేషాన్ని ఓడించారని అన్నారు.
‘మా వెంట నిజం ఉంది. పేద ప్రజలు ఉన్నారు. బీజేపీకి డబ్బు ఉంది.. పోలీసులు ఉన్నారు. అన్నీ ఉన్నాయి. అయినా కర్ణాటక ప్రజలు వారి వద్ద ఉన్న అన్ని శక్తుల్ని ఓడించారు. మా పాదయాత్రలో చెప్పినట్టు ఈ ఎన్నికల్లో విద్వేషంపై ప్రేమ గెలిచింది. ప్రజలు బీజేపీని, వారి అవినీతిని, విద్వేషాన్ని ఓడించారు. బీజేపీ పాలనలో కర్ణాటకలో అవినీతి రాజ్యమేలింది. ఇప్పుడు అవినీతికి తావులేదు. ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని మీరు చూస్తారు’ అని అన్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు 5 ప్రధాన హామీలు ఇచ్చిందని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. ‘మేము ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వము. బీజేపీలా హామీలు ఇచ్చి మాట తప్పడం మా పార్టీ నైజం కాదు. ఏది చెప్పామో అదే చేస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు 5 ప్రధాన హామీలు ఇచ్చాం. మరో ఒకటి లేదా రెండు గంటల్లో కేబినెట్ తొలి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే ప్రజలకు ఇచ్చిన 5 హామీలకు చట్టబద్ధత కల్పిస్తాం’ అని రాహుల్ తెలిపారు.
‘గత ఐదేండ్లుగా మీరు (ప్రజలు) పడిన బాధలు మాకు అర్థమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలిచిందంటూ వివిధ విశ్లేషణలు జరిగాయి. నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ అండగా నిలవడమే విజయానికి కారణం’ అని రాహుల్ చెప్పుకొచ్చారు.
#WATCH | We made 5 promises to you. I had said we don't make false promises. We do what we say. In 1-2 hours, the first cabinet meeting of the Karnataka govt will happen and in that meeting these 5 promises will become law: Congress leader Rahul Gandhi pic.twitter.com/hhsancnayq
— ANI (@ANI) May 20, 2023
After Congress's victory, many things were written as to how Congress won this election, different analyses were done but I want to say that Congress won because we stood with the poor, Dalits, and Adivasis, backwards. We had truth, poor people. BJP had money, police and… pic.twitter.com/RFibjCOpCO
— ANI (@ANI) May 20, 2023
#WATCH | Bengaluru | "Nafrat ko mitaya, Mohabbat jeeti," says Congress leader Rahul Gandhi after the swearing-in ceremony of the newly-elected Karnataka Government. pic.twitter.com/imwoC8HowV
— ANI (@ANI) May 20, 2023
Bengaluru | "We will give you a clean, non-corrupt government," says Congress leader Rahul Gandhi after the swearing-in ceremony of the newly-elected #Karnataka Government. pic.twitter.com/0NvQQYv5we
— ANI (@ANI) May 20, 2023
Also Read..
Suriya | నువ్వు ఒక ధ్రువతారవు.. అభిమాని మృతి పట్ల హీరో సూర్య భావోద్వేగం
Ice Cream | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్క్రీమ్.. ధర రూ.5లక్షల పైమాటే
Rishi Sunak | ఏడాదిలో రూ.వేల కోట్లు ఆవిరైన సునాక్ దంపతుల సంపద