న్యూఢిల్లీ: పార్లమెంట్(Parliament)లో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. ఇవాళ కూడా 49 మంది లోక్‌సభ ఎంపీలను సస్పెండ్ చేశారు. స్మోక్ అటాక్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆందోళన చేస్తున్న సభ్యుల్ని రోజువారిగా సస్పెండ్ చేస్తోంది ప్రభుత్వం. సోమవారం ఒక్క రోజే పార్లమెంట్లో 79 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అదే జోరులో ఇవాళ కూడా మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో పార్లమెంట్ నుంచి శీతాకాల సమావేశాల్లో సస్పెన్షన్‌కు గురైన వారి సంఖ్య మొత్తం 141కి చేరుకున్నది.
#WinterSession2023 #LokSabha: Parliamentary Affairs MoS @arjunrammeghwal moves motion to suspend few more MPs from the House.@ombirlakota @LokSabhaSectt @loksabhaspeaker pic.twitter.com/ZsOAHAVzqL
— SansadTV (@sansad_tv) December 19, 2023
ఎన్సీపీ నేత ఫారూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత శశిథరూర్, కార్తీ చిదంబరం, సుప్రియా సూలే, డింపుల్ యాదవ్‌లను స్పీకర్ ఓం బిర్లా ఇవాళ సస్పెండ్ చేశారు. సోమవారం రోజున రాజ్యసభలో 45 మంది, లోక్‌సభలో 33 మందిని సస్పెండ్ చేశారు.