JK Elections | జమ్ముకశ్మీర్‌లో (Jammu And Kashmir) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వకూ 46.12 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
అత్యధికంగా రియాసి (Reasi) జిల్లాలో 63.91 శాతం పోలింగ్ నమోదుకాగా.. అత్యల్పంగా శ్రీనగర్‌లో 22.62 శాతం ఓటింగ్ నదైనట్లు తెలిపింది. పూంచ్‌లో 61.45 శాతం, రాజౌరిలో 58.95 శాతం, బుద్గాంలో 49.44 శాతం, గందర్బల్లో 61.45 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు వెల్లడించింది.
Jammu & Kashmir Assembly elections | 46.12% voter turnout recorded till 3 pm in the second phase of polling in 26 constituencies in six districts of the UT pic.twitter.com/2lINynkljt
— ANI (@ANI) September 25, 2024
రెండో విడతలో భాగంగా పీర్‌పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి భవితవ్యాన్ని 25.78 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. రెండో విడత ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నారు.
మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్‌లో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగిలిన 40 స్థానాలకు తుది విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
Also Read..
Edavela Babu | మీటూ కేసులో మలయాళ నటుడు ఇడవేల బాబు అరెస్ట్
Damini App | పిడుగులపై ‘దామిని’ ముందస్తు హెచ్చరికలు.. ఈ యాప్ గురించి మీకు తెలుసా..?
Artificial Rain | ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. ఎప్పుడు..? ఎందుకంటే..?