Army Personnel | సిక్కిం (Sikkim)లో రోడ్డు ప్రమాదం సంభవించింది. వాహనం అదుపుతప్పి 700 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బంది (Army Personnel) ప్రాణాలు కోల్పోయారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ సిబ్బంది పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని పాక్యోంగ్ (Pakyong) వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి సుమారు 700 నుంచి 800 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారంతా పశ్చిమ బెంగాల్‌లోని బినాగురికి చెందిన ఎన్‌రోట్ మిషన్ కమాండ్ విభాగానికి చెందిన వారుగా భారత ఆర్మీ అధికారులు తెలిపారు.
Also Read..
Lion | సింహానికి భయం రుచిచూపిన హిప్పో.. వీడియో
GOAT Movie | విజయ్ గోట్ చిత్రాన్ని వీక్షించేందుకు.. మేకతో థియేటర్‌కు వచ్చిన నటుడు కూల్ సురేశ్
Mass layoffs | కొనసాగుతున్న లేఆఫ్స్ పర్వం.. ఆగస్టులోనే 27 వేల మంది టెకీలపై వేటు..