GOAT Movie | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన తాజా చిత్రం ‘గోట్'(Goat Movie) (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) . వెంకట్‌ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
విజయ్ సినిమా అంటే మామూలుగానే హైప్స్ ఓ రేంజ్లో ఉంటాయి. ‘గోట్'(Goat Movie) ఆయన రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత విడుదల అవుతున్న సినిమా. పైగా ఇదే విజయ్ ఆఖరు సినిమా అంటూ కూడా ప్రచారం జరిగింది. దాంతో ఈ సినిమాకు తమిళనాట అంచనాలు అవధులు దాటిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ రిలీజ్ సందర్భంగా విజయ్ ఫ్యాన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద విజయ్ ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. డప్పు వాయిద్యాలు, పటాసులు కాలుస్తూ, డ్యాన్సులతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు కూల్ సురేశ్ (Cool Suresh) విజయ్ ‘గోట్’ చిత్రాన్ని వీక్షించేందుకు చెన్నైలోని ఓ థియేటర్‌కు ‘గోట్’ (మేక)తో వచ్చారు. అతని చూసిన అభిమానులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ఆయన మేకతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ (గోట్)పై కోలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. విజయ్ తమిళ రాజకీయాల్లోకి ఎంటరైన నేపథ్యంలో ఈ సినిమానే అతని చివరి సినిమా అనే ప్రచారం కారణంగానే ఈ హైప్. విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. వెంకట్‌ప్రభు దర్శకుడు. కల్పాతి అఘోరం, కల్పాతి గణేశ్, కల్పాతి సురేశ్ నిర్మాతలు.
Also Read..
Pranitha Subhash | మగబిడ్డకు జన్మనిచ్చిన నటి ప్రణీత.. నెట్టింట శుభాకాంక్షలు వెల్లువ
HIT 3 Movie | చార్జ్ తీసుకున్న అర్జున్ సర్కార్.. నాని హీరోగా ‘హిట్ 3’.. గ్లింప్స్ రిలీజ్