Nani HIT 3 Movie | తెలుగు కథానాయకుడు నాని వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. రీసెంట్గా సరిపోదా శనివారంతో హిట్ అందుకున్న ఈ నటుడు మరో క్రేజీ మూవీని అనౌన్స్ చేశాడు. నాని బ్యానర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో హిట్‌తో పాటు హిట్ 2 రాగా రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్నాయి. అయితే ఈ ఫ్రాంచైజీ నుంచి సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నాడు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
గ్లింప్స్ చూస్తుంటే.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రానుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక హిట్ సినిమా ఫ్రాంచైజీ విషయానికి వస్తే.. నాని నిర్మాణంలో ఈ చిత్రాలు రాగా.. మొదటి పార్ట్‌లో విష్వక్ సేన్ నటించగా.. సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించాడు.
Also read..