న్యూయార్క్: అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి జెస్సికా పెగులా(Jessica Pegula) స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో ఆమె ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్‌ను ఓడించింది. 6-2, 6-4 స్కోరు తేడాతో ప్రత్యర్థిని ఓడించి.. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది జెస్సికా. ఏడు సార్లు మేజర్ టెన్నిస్ టోర్నీల్లో క్వార్టర్స్ వరకు వెళ్లిన జెస్సికా.. ఆర్దర్ ఆషే స్టేడియంలో సాధించిన విక్టరీపై సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఎట్టకేలకు తాను సెమీస్‌కు వెళ్లినట్లు మ్యాచ్ ముగిసిన తర్వాత పేర్కొన్నది.
నెంబర్ వన్ ప్లేయర్ స్వియాటెక్ ఆరంభం నుంచి కొంత బలహీనంగానే కనిపించింది. గత నెలలో కెనడియన్ ఓపెన్‌కు దూరంగా ఉన్న ఆమె.. ఈ మ్యాచ్‌లో సరైన రీతిలో సర్వ్ చేయలేదు. ఇద్దరి మధ్య రెండో సెట్ రసవత్తరంగా సాగింది. చివరకు జెస్సికా పెగులా ఆ సెట్‌ను కైవసం చేసుకున్నది. సెమీస్‌లో కరోలినా ముచోవ్తో జెస్సికా తలపడనున్నది.
Believe it, Jessica! You’re a Grand Slam semifinalist 😍 pic.twitter.com/n5UbED1I8N
— US Open Tennis (@usopen) September 5, 2024