Pranitha Subhash | ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన నటి ప్రణీత (Pranitha Subhash) రెండోసారి తల్లయ్యారు. బుధవారం పండంటి మగబిడ్డకు (baby boy) జన్మనిచ్చారు. బిడ్డతో ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ప్రణీతకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ కన్నడ సోయగం.. పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. కరోనా సమయంలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని వివాహం చేసుకున్నారు. 2021లో కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 2022లో ఈ జంటకు ఆడబిడ్డ పుట్టింది. ఇప్పుడు రెండో కాన్పులో ప్రణీత మగబిడ్డకు జన్మనిచ్చారు.
Also Read..
HIT 3 Movie | చార్జ్ తీసుకున్న అర్జున్ సర్కార్.. నాని హీరోగా ‘హిట్ 3’.. గ్లింప్స్ రిలీజ్
Nizamsagar | నిజాంసాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల