Lion | సింహం (Lion) .. అడవికే రారాజు. దాన్ని చూస్తేనే ఒంట్లో వణుకుపుడుతుంది. దాని గర్జన వింటే ఏకంగా ఆమడ దూరం పరిగెడతాం. మనుషులమే కాదు.. అడవిలో జీవనం సాగిస్తున్న ఇతర జంతువులు సైతం దాన్ని చూసి భయపడతాయి తప్ప.. సింహం ఏ ఇతర జంతువుకూ భయపడదు. అలాంటి ఆ సింహానికే భయం రుచిచూపించింది ఓ హిప్పో (hippo).
ఆఫ్రికా (African)లోని షెంటన్ సఫారిస్ కైంగో క్యాంప్ (Shenton Safaris Kaingo Camp)లో గల లుయాంగ్వా నది (Luangwa River)లో సింహం స్విమ్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో నదిలో ఓ హిప్పో కూడా ఉంటుంది. సింహాన్ని చూసిన హిప్పో మెల్లగా దాని వెనకాల వచ్చి వెంబడిస్తుంది. పలుమార్లు దానిపై దాడి చేస్తుంది. దీంతో సింహం ప్రాణ భయంతో అక్కడి నుంచి వేగంగా ఈదుకుంటూ నది బయటకు వెళ్లిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
GOAT Movie | విజయ్ గోట్ చిత్రాన్ని వీక్షించేందుకు.. మేకతో థియేటర్‌కు వచ్చిన నటుడు కూల్ సురేశ్
Virat Kohli | రూ.66 కోట్ల ట్యాక్స్ చెల్లించిన విరాట్ కోహ్లీ.. మరి ధోనీ ఎంతో తెలుసా..?
Solar Energy | పదేండ్లలో 32 రెట్లు పెరిగిన సౌరశక్తి సామర్ధ్యం : ప్రధాని మోదీ