Virat Kohli | టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. మరో అరుదైన ఘనత సాధించారు. భారత క్రీడాకారుల్లోనే అత్యధికంగా ట్యాక్స్ పే చేసిన క్రికెటర్‌గా నిలిచారు. విరాట్.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.66 కోట్ల పన్ను చెల్లించారు. ఈ మేరకు ఫార్చ్యూన్ ఇండియా నివేదిక వెల్లడించింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా ట్యాక్స్ కట్టిన స్టార్స్ లిస్ట్‌ను ఫార్చ్యూన్ ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. విరాట్ తర్వాత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) రూ.38 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. సచిన్ టెండూల్కర్ రూ.28 కోట్లు, సౌరభ్ గంగూలీ రూ.23 కోట్లు, భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రూ.13 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఇక ఫార్చ్యూన్ ఇండియా లిస్ట్‌లో భారతీయ సెలబ్రిటీలందరిలోకల్లా బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖానే (Shah Rukh Khan) ఎక్కువ ట్యాక్స్ కట్టారు. ఆయన ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.92 కోట్ల పన్ను చెల్లించారు. ఆ తర్వాత స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) ఉన్నారు. ఆయన ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్లు పన్ను రూపంలో చెల్లించారు. ఇక రూ.75 కోట్లతో సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో, రూ.71 కోట్లతో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇక మొత్తంగా చూస్తే టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ.66 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.
Also Read..
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 13వ ఘటన
Godavari | భద్రాచలం వద్ద గోదావరికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి