బుధవారం 27 మే 2020
National - May 07, 2020 , 06:21:52

3926 కాట‌న్ల మ‌ద్యం చోరీ..పీఎస్ లో ఫిర్యాదు..

3926 కాట‌న్ల మ‌ద్యం చోరీ..పీఎస్ లో ఫిర్యాదు..

హ‌ర్యానా: లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా హ‌ర్యానాలో భారీ మొత్తంలో మ‌ద్యం చోరీకి గురైంది. స‌మ‌ల్ఖా గోదాంలో నిల్వ ఉంచిన 3926 కాట‌న్ల మ‌ద్యం చోరీ కావ‌డంతో..ఎక్సైజ్ డిపార్టుమెంట్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది.

ఎక్సైజ్ ఆఫీస‌ర్ రాజేశ్ రోహిల్లా మాట్లాడుతూ..2016లో తాళం వేసి ఉన్న గోదాం నుంచి కొన్ని కాట‌న్లు మిస్స‌య్యాయి. ఆ త‌ర్వాత 2018లో మ‌రోసారి చోరీ జ‌రిగింది. అప్పుడు ఫిర్యాదు కూడా చేశాం. ఆ గోదాం మ‌ళ్లీ ప్రారంభమైంది. చోరీకి గురైన గోదాంలో 2016 నుంచి 2020 వ‌ర‌కు ఉన్న నిల్వ‌లను ప‌రిశీలించ‌గా 3926  కాట‌న్లు అదృశ్య‌మైన‌ట్లు గుర్తించామ‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo