కొత్తగూడెం ప్రగతి మైదాన్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివరాలను బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ మీడియాకు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 26 మందిపై రూ.84 లక్షల రివార్డులు ఉన్నాయని, ఇందులో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారని తెలిపారు.
ఈ 26 మందిపై రూ.లక్ష నుంచి రూ.8 లక్షల రివార్డు ఉన్నవారు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ డివిజన్ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయార్థం రూ.50 వేల ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు తెలిపారు.