Earthquake | హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు (Earthquake) వణికించాయి. మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ తర్వాత స్వల్ప తీవ్రతతో మరో రెండుసార్లు ప్రకంపణలు వచ్చాయి. టిబెట్ (Tibet) కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
Strong 7.0 earthquake that hit Tibet region made significant damage.
Earthquake was widely felt in Nepal and India.#earthquake #sismo #temblor pic.twitter.com/eKVICcvWB0— Disasters Daily (@DisastersAndI) January 7, 2025
నేపాల్‌తోపాటు చైనా, భారత్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపం ధాటికి కనీసం 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియాను ఊటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. అదే సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు పేర్కొంది.
A 7.1 magnitude earthquake has rocked Nepal near Lobuche.
Exclusive Earthquake video from Nepal 🇳🇵
📌 Location: 93 km NE of Lobuche
📏 Depth: 10 km⚠️ Reports of damage are still coming Prayers for everyone affected 🙏 #Earthquake #BreakingNews #Nepal #EarthquakePH. #lockdown pic.twitter.com/HCzpsfksJC
— Kedar (@shintre_kedar) January 7, 2025
నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన మానిటరింగ్ ఏజెన్సీ మాత్రం భూకంప తీవ్రతను 6.8గా పేర్కొన్నది. టిబెల్ రాజధాని లాసాకు సుమారు 380 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. టిబెట్‌లో రెండో అతిపెద్ద నగరమైన షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. అనంతరం షిజాంగ్ ప్రాంతంలోనే మరో రెండుసార్లు భూమి కంపించిందని, వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7, 4.9గా నమోదయిందని వెల్లడించింది.
💥 BREAKING: A 7.1 magnitude earthquake has rocked Nepal near Lobuche.
Exclusive Earthquake video from Nepal 🇳🇵
📌 Location: 93 km NE of Lobuche
📏 Depth: 10 km
⏱️ Time: Jan 7, 1:05:16 UTC⚠️ Reports of damage are still coming in. Prayers for everyone affected 🙏💔. #Earthquake… pic.twitter.com/aYL4B4EbcJ
— Dilojan 𝕏 (@umadilojan) January 7, 2025
భూకంప తీవ్రత ఉత్తర భారతాన్ని కూడా తాకింది. ఢిల్లీ ఎన్సీఆర్, బెంగాల్, బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు పలు ప్రాంతాల్లోనూ ప్రకంపణలు సంభవించాయి. బీహార్‌లో ఆందోళనకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఇక చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది. భారీ భూకంపం ధాటికి పలుచోట్ల ఎత్తైన భవనాలు నేలకూలాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంటోంది.
Also Read..
Earthquake | నేపాల్‌లో భారీ భూకంపం.. ఉత్తర భారతంలోనూ ప్రకంపణలు
Earthquake: టిబెట్ కేంద్రంగా భూకంపం.. చైనాలో 9 మంది మృతి
Elon Musk | అమెరికాలోనే కాదు ఐరోపా దేశాల్లోనూ.. మంట పెడుతున్న మస్క్