Earthquake | నేపాల్‌లో భారీ భూకంపం.. ఉత్తర భారతంలోనూ ప్రకంపణలు
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదయింది. లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
న్యూఢిల్లీ: హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు (Earthquake) వణికించాయి. మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆతర్వాత స్వల్ప తీవ్రతతో మరో రెండుసార్లు ప్రకంపణలు వచ్చాయి. కొన్ని క్షణాలపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఖఠ్మండూతోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులుపెట్టారు.
మంగళవారం ఉదయం 6.35 గంటలకు నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో భూమి కపించింది. టిబెట్‌లో రెండో అతిపెద్ద నగరమైన షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. అనంతరం షిజాంగ్ ప్రాంతంలోనే మరో రెండుసార్లు భూమి కంపించిందని, వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7, 4.9గా నమోదయిందని వెల్లడించింది.
భూకంప తీవ్రత ఉత్తర భారతాన్ని కూడా తాకింది. ఢిల్లీ ఎన్సీఆర్, బెంగాల్, బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు పలు ప్రాంతాల్లోనూ ప్రకంపణలు సంభవించాయి. బీహార్‌లో ఆందోళనకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఇక చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది.
కాగా, టిబెట్‌లోని షిగెట్స్ పట్టణంలో గత ఐదేండ్లలో 29 సార్లు భూకంపం వచ్చింది. ఇవన్నీ 3 లేదా అంతకంటే ఎక్కవ తీవ్రతతో కూడుకున్నవని, 200 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. అయితే మంగళవారం ఉదయం సంభవించిన భూకంపంతో పోల్చితే ఇవన్నీ చాలా చిన్నవని తెలిపారు.
EQ of M: 7.1, On: 07/01/2025 06:35:18 IST, Lat: 28.86 N, Long: 87.51 E, Depth: 10 Km, Location: Xizang.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/aHk6kS9Zcm— National Center for Seismology (@NCS_Earthquake) January 7, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi- NCR
- Earthquake
- Lobuche
- NCS
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

