Goods Train | మధ్యప్రదేశ్లో ఓ గూడ్స్ రైలు (Goods Train) పట్టాలు తప్పింది. పశ్చిమ మధ్య రైల్వే (West Central Railway) పరిధిలో సోమవారం మధ్యాహ్నం 12:45 గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు (Goods Train Derail) అధికారులు తెలిపారు.
భోపాల్ (Bhopal) సమీపంలోని మిస్రోడ్ – మండిదీప్ రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. ఆ మార్గాన్ని పునరుద్ధరించే పనులు మొదలు పెట్టారు.
Also Read..
Floods | వరదలతో యూపీ అతలాకుతలం.. 14 మంది మృతి
Manu Bhaker | నీరజ్ చోప్రాకు గాయం.. మను బాకర్ రియాక్షన్ ఇదే..
Actor Darshan | గతంలో దర్శన్ ఉన్న బెంగళూరు జైల్లో ఫోన్లు, కత్తులు, సిగరెట్లు లభ్యం..!