భువనేశ్వర్: ఒక పాము చిన్నారులను కాటు వేసింది. (Snake bite) దీంతో ముగ్గురు తోబుట్టువులు మురణించారు. పాము కాటుకు గురైన వారి తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒడిశాలోని బౌద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి చరియపలి గ్రామంలోని ఒక ఇంట్లోకి పాము దూరింది. నిద్రిస్తున్న ముగ్గురు పిల్లలు, వారి తండ్రిని పాము కాటు వేసింది. ఈ సంఘటనలో ముగ్గురు తోబుట్టువులు మరణించారు. మృతులను 12 ఏళ్ల స్మృతికా మల్లిక్, 9 ఏళ్ల శుభరేఖ మల్లిక్, మూడేళ్ల సుర్వి మల్లిక్గా గుర్తించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాము కాటు వల్ల మరణించిన తోబుట్టువుల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లల తండ్రిని కూడా పాము కాటు వేసిందని, ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.