Kanwariyas Killed | ఉత్తరాఖండ్ (Uttarakhand) టెహ్రీ (Tehri) జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్వర్ యాత్రికులతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు (Kanwariyas Killed). అనేక మంది గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాకు చెందిన 21 మంది కన్వర్ యాత్రికులు ఉత్తరకాశీ జిల్లాలోని హర్షిల్ వైపు ఓ ట్రక్కులో వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు టెహ్రీ జిల్లాలో అదుపుతప్పి బోల్తాపడినట్లు నరేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి సంజయ్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 18 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కుపోయిన నాలుగేళ్ల చిన్నారిని సురక్షితంగా రక్షించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను విక్కీ, సునీల్ సైని, సంజయ్గా గుర్తించారు.
Also Read..
Infosys Techie | ఆఫీస్ వాష్‌రూమ్‌లో రహస్యంగా మహిళల వీడియోలు రికార్డ్.. ఏపీకి చెందిన టెకీ అరెస్ట్
GST Relief | మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ రిలీఫ్.. ఆ వస్తువులపై పన్ను తగ్గించే యోచనలో కేంద్రం..?
Himachal Pradesh | భారీ వర్షాలకు హిమాచల్ అతలాకుతలం.. 51 మంది మృతి