ISIS Terrorists | దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Gujarat Anti Terrorism Squad) భగ్నం చేసింది. ఈ మేరకు ముగ్గురు అనుమానితుల్ని (Terrorists) అదుపులోకి తీసుకుంది. వారికి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ (ISIS)తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వారిపై ఉన్నాయని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏడాది కాలంగా వారిపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు. వారు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ (Planning Attacks In India) చేసినట్లు అధికారులు వివరించారు. ఇందులో భాగంగానే ఆయుధాల మార్పిడి కోసం గుజరాత్‌కు వచ్చినట్లు గుర్తించారు. అరెస్టయిన ముగ్గురు అనుమానితులు రెండు వేర్వేరు మాడ్యూల్లకు చెందినవారుగా పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఐదుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Also Read..
Rahul Gandhi | ఓటు చోరీని కప్పిపుచ్చుకునేందుకే SIR : రాహుల్ గాంధీ
Ajit Pawar | భూ కుంభకోణం.. డీల్ రద్దు చేయాలంటే రూ.42 కోట్లు చెల్లించాల్సిందే..!
Passwords | 2025లో అత్యధికమంది వాడుతున్న కామన్ పాస్వర్డ్స్ ఇవే..