జియో హాట్స్టార్ రూపొందిస్తున్న కొత్త రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’. ప్రస్తుతం ఈ షో చిత్రీకరణ దశలో ఉన్నది. ఈ షోకు చెందిన ఎక్స్క్లూజివ్ చిత్రాలు రీసెంట్గా బయటకు వచ్చాయి. విశాలమైన మాన్షన్లో 10మంది సెలబ్రిటీలు 70రోజుల ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రేమ, నమ్మకం, సహనం.. ఈ మూడింటి భాగస్వామ్యాన్ని 24/7 కెమెరాల పర్యవేక్షణలో పరీక్షించే విధంగా ఈ లవ్ మ్యాన్షన్ని డిజైన్ చేశారు.
బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నిరంతరం కెమెరాల నడుమ రూపొందుతున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని మేకర్స్ చెబుతున్నారు. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి, సీనియర్ హీరోయిన్ రాధ, లయ ఈ షోకి జ్యూరీగా ఉండటం విశేషం. శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది.