హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జూలై నెలలో 39% లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి జూలై 24 వరకు సగటు లోటు వర్షపాతం 27 శాతంగా నమోదైంది. జూలై నెలలో సగటు వర్షపా తం శుక్రవారం నాటికి 176 మి.మీ. కురువాల్సి ఉండగా.. కేవలం 107.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. రంగారెడ్డి, నల్లగొండ, ములుగు, సంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా 26 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైం ది. రాష్ట్రంలో సగటున 28 రోజుల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ములుగు జిల్లాలో మాత్రమే ఒక రోజు అదనం గా 29 రోజులు కురిసినట్టు చెప్పారు. నిర్మల్‌లో 28 రోజులు, సంగారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 24 రోజులు, మెదక్, భద్రాద్రి-కొత్తగూడెం, నిజామాబాద్‌లో 23, మహబూబాబాద్‌లో 22, రం గారెడ్డిలో 21, నల్లగొండలో 20 రోజుల చొప్పున వర్షం కురిసినట్టు వెల్లడించారు. గద్వాల జిల్లాలో అతి తక్కువగా 11 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. ఈ జిల్లాలో జూ న్ 1 నుంచి జూలై 24 వరకు 167 మి.మీ. వర్షం కురువాల్సి ఉండగా 130.1 మి.మీ. కురిసింది. యాదాద్రి-భువనగిరిలో 12 రోజు లు, వనపర్తి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో 13 రోజులు వర్షం కురిసింది.