ఉదంపూర్, ఆగస్టు 7: జమ్ముకశ్మీర్‌లో జవాన్లతో వెళ్తున్న బస్ లోయలో పడి ముగ్గురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. 187 బెటాలియన్‌కు చెందిన 23 మంది జవాన్లతో వెళ్తున్న మినీ బస్ గురువారం ఉదయం 10.30 గంటలకు బసంత్గర్ ప్రాంతంలోని ఖండ్వాలో పక్కన ఉన్న లోయలోకి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు.