ముంబై, జనవరి 24 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో వెట్టిచాకిరీ చేస్తున్న తెలంగాణకు చెందిన 29 మంది కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. పర్బనీ జిల్లా, సేలు తాలూకాలోని నందగావ్ గ్రామపొలిమేరలో ఆర్.బి.ఘోడే కన్స్ట్రక్షన్లో వెట్టి చాకిరీ చేస్తున్న 29 మంది కార్మికులను, ఏడుగురు చిన్న పిల్లలను అధికారులు రక్షించారు. దీనిపై శుక్రవారం చార్థానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
నందగావ్లోని క్రషర్లో పనిచేస్తున్న కార్మికులతో సాధారణ పనివేళల కంటే ఎకువ పని చేయిస్తున్నారని ఎఫ్డీసీ ఎన్జీవోకు కొందరు ఫిర్యాదు చేశారు. జిల్లా యంత్రాంగం కార్మికులకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించింది.