Minibus Overturns | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో ప్రమాదం జరిగింది. రాజౌరి (Rajouri) జిల్లాలో ఓ మినీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది (Minibus Overturns). ఈ ఘటనలో 30 మందిదాకా గాయపడ్డారు. గాయపడినవారిలో అధికభాగం విద్యార్థులే అని తెలిసింది.
బస్సు రాజౌరి పట్టణానికి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో థాండికాస్సి సమీపంలో హైవేపైకి రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనలో 28 మంది గాయపడ్డారు. అందులో 26 మంది విద్యార్థులేనని (Students Injured) అధికారులు తెలిపారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజౌరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని మెరుగైన వైద్యం కోసం జమ్ము జీఎమ్సీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
STORY | Mini bus overturns in J-K’s Rajouri; many students among 28 injured
At least 28 persons, mostly students, were injured when a mini bus overturned on a highway in Rajouri district of Jammu and Kashmir on Tuesday, officials said. The bus was on its way to Rajouri town when… pic.twitter.com/PLjKo8socB
— Press Trust of India (@PTI_News) November 4, 2025
Also Read..
Akasa Air | టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు.. అరెస్ట్
TVK | కరూర్ తొక్కిసలాట.. విజయ్ కీలక నిర్ణయం