Akasa Air | వారణాసి నుంచి ముంబైకి (Varanasi to Mumbai Flight) బయల్దేరిన ఆకాశా ఎయిర్ (Akasa Air) విమానంలో ఓ ప్రయాణికుడు (Passenger) గందరగోళం సృష్టించాడు. విమానం రన్వేపు వెళ్తుండగా.. అందులోని ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ (Emergency Exit) తెరిచేందుకు ప్రయత్నించాడు. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం 6:45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
QP 1497 విమానం ముంబైకి బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. విమానం రన్వేవైపు వెళ్తున్న సమయంలో అందులోని ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. గమనించిన సిబ్బంది అతడిని అడ్డుకుని పైలట్‌కు సమాచారం ఇచ్చారు. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు. అనంతరం అతడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. సదరు ప్రయాణికుడు జౌన్పూర్ జిల్లాలోని గౌరా బాద్షాపూర్ నివాసి సుజిత్ సింగ్‌గా గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి చర్యతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
TVK | కరూర్ తొక్కిసలాట.. విజయ్ కీలక నిర్ణయం
Air India | ఢిల్లీ-బెంగళూరు ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. భోపాల్‌కు మళ్లింపు