TVK | కరూర్ తొక్కిసలాట (Karur Sampede) ఘటన నేపథ్యంలో తమిళ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ (Actor Vijay) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో క్రౌడ్ కంట్రోల్ కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ నిర్వహించే సభలు, ప్రచార కార్యక్రమాల్లో జనసమూహాన్ని నియంత్రించడంతోపాటూ, ప్రజా భద్రతను నిర్ధరించడానికి ‘తొండర్ అని’ (Thondar Ani) పేరుతో వాలంటీర్ బృందాన్ని పార్టీ ఏర్పాటు చేసింది.
2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీని స్థాపించిన విజయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన నేపథ్యంలో టీవీకే తాజా నిర్ణయం తీసుకుంది.
Also Read..
Bengaluru Doctor: నీ కోసం నా భార్యను చంపా.. లవర్‌కు మెసేజ్ చేసిన బెంగుళూరు డాక్టర్
Air India | ఢిల్లీ-బెంగళూరు ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. భోపాల్‌కు మళ్లింపు
Air Pollution | వరుసగా మూడో రోజూ.. అధ్వానస్థితిలోనే గాలి నాణ్యత