శుక్రవారం 05 జూన్ 2020
National - May 15, 2020 , 00:20:11

అద్దె ఇంట్లో ఉండేవారికి గుడ్ న్యూస్

అద్దె ఇంట్లో ఉండేవారికి గుడ్ న్యూస్


 కేంద్ర ప్రభుత్వం అద్దెకు ఉంటున్న వారికి శుభవార్త అందించింది. పట్టణాల్లోని పేదలకు, వలస కార్మికుల కోసం అందుబాటులోనే అద్దె ఉండేలా చూసేందుకు కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పథకం వివరాలను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది. పీపీపీ మోడల్ కింద పట్టణాల్లో హౌసింగ్ ప్రాజెక్టులను నిర్మిస్తామని ఆమె తెలిపారు. వీటిని ఆఫర్డబుల్ రెంటల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లుగా మారుస్తామని పేర్కొన్నారు.  ఇంటి కొనుగోలుదారులకు నిర్మలా సీతారామన్ శుభవార్త అందించారు. హోమ్ లోన్‌పై మధ్యతరగతి ప్రజలు మళ్లీ సబ్సిడీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మోదీ సర్కార్ తాజాగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌ను (ఎంఐజీ 1, ఎంఐజీ 2) మరి కొంత కాలం పొడిగించింది. 


logo