పరిగి, మే 1: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మం డలంలోని సయ్యద్‌పల్లి, రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల్లో ఆయన బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి రాంచందర్‌రావుతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నిక ల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.
ఆరుగ్యారెంటీల పేరిట ప్రజలను హస్తం పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ర్టాభివృద్ధికి కృషి చేసిన కేసీఆర్‌ను కాదనుకొని తాము తప్పు చేశామని ప్రజలు గ్రహించారన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలకు ఎలాంటి మేలు జరుగలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కేవలం బీఆర్ఎస్ అధినేత కేసీఆరేనని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల ఈ ఎన్నికల్లో కేసీఆర్ బలపర్చిన కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
అనంతరం బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి రాంచందర్‌రావు మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉన్నారని.. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్తోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, బీఆర్ఎస్ పార్టీ మండ లాధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వెంకటయ్య, వెంకట్రాంకృష్ణారెడ్డి, జగన్, జంగయ్య పాల్గొన్నారు.