చేవెళ్లటౌన్, మే 1 : కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మి ఆగం కావొద్దని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన బూత్ లెవల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ మరోసారి మనల్ని మోసం చేసేందుకు యత్నిస్తున్నారని.. తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీసీ బిడ్డ కాసానిని గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల మండల మాజీ ఎంపీపీ మంగలి బాల్‌రాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, మాజీ సర్పంచ్‌లు నర్సింహులు, ఆంజనేయగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు తలారం నర్సింహులు, గిరిధర్‌రెడ్డి, నర్సింహులు, డైరెక్టర్లు వెంకటేశ్, మహేశ్, చందు, రాంప్రసాద్, వెంకటేశ్ పాల్గొన్నారు.