WI vs SA : సూపర్ 8 ఆరంభ మ్యాచ్‌లో భారీ విజయంతో హెచ్చరికలు పంపిన వెస్టిండీస్.. రెండో మ్యాచ్‌లో తడబడినా.. నిలబడింది. నరేంద్ర మోడీ స్టేడియంలో పవర్ ప్లేలోనే దక్షిణాఫ్రికా బౌలర్లు వికెట్ల వేటతో పైచేయి సాధించినా.. ఆఖరి పంచ్ మాత్రం విండీస్ హిట్టర్లదే. కగిసో రబడ(2-22) లుంగి ఎంగడి(3-30)ల విజృంభణతో 83కే ఏడు కీలక వికెట్లు కోల్పోయిన కరీబియన్ జట్టు అనూహ్యంగా.. 170 ప్లస్ కొట్టింది.. మరో 30 పరుగుల్లోపే కుప్పకూలుతుందనుకున్న వేళ.. జేసన్ హోల్డర్(49), రొమారియో షెపర్డ్(52 నాటౌట్)లు అసమాన ఆటతో సఫారీ బౌలర్లను బెంబేలెత్తించారు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిన ఈ ద్వయం.. ఎనిమిదో వికెట్‌కు 89 రన్స్ జోడించి భారీ స్కోరందించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే దక్షిణాఫ్రికా పేసర్లు ఝలక్ ఇచ్చారు. ఓపెనర్ షాయ్ ఓప్(16)ను మూడో ఓవర్లోనే ఔట్ చేసి న కగిసో రబడ(2-22) తొలి వికెట్ అందించాడు. జింబాబ్వేపై తుఫాన్‌లా విరుచుకుపడిన షిమ్రన్ హిట్మైర్(2)ను పెవిలియన్ పంపిన రబడ విండీస్‌కు మరో షాకిచ్చాడు. కాసేపటికే లుంగి ఎంగిడి() ఓవర్లో బ్రాండన్ కింగ్(21) ఔట్ కాగా.. రోస్టన్ ఛేజ్(2) సైతం ఎంగిడికి దొరికిపోయాడు.
Momentum swing alert 🚨
Jason Holder responds with a massive six off Maharaj as West Indies try to turn things around 💪
ICC Men’s #T20WorldCup | Super 8 #WIvSA | LIVE NOW 👉 https://t.co/IaEbZJRFNR pic.twitter.com/tqCoaoqJPL
— Star Sports (@StarSportsIndia) February 26, 2026
ఫలితంగా పవర్ ప్లేలోనే 43 పరుగులకే 4 వికెట్లు పడిన వేళ.. రొవ్మన్ పావెల్(9), డేంజరస్ షెర్ఫానే రూథర్‌ఫోర్డ్(12)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ.. పావెల్‌ను ఎంగిడి బోల్తా కొట్టించగా.. డేంజరస్ రూథర్‌ఫోర్డ్, మాథ్యూ ఫొర్డే(11)లను కార్బిన్ బాస్చ్(2-31) వెనక్కి పంపగా.. 83కే ఏడు కీలక వికెట్లు కోల్పోయింది. మరో 20 , 30లోపే విండీస్‌ను ఆలౌట్ చేయాలనుకున్న సఫారీ బౌలర్లకు రొమారియో షెపర్డ్(52 నాటౌట్), జేసన్ హోల్డర్(49)లు ప్రతిఘటించారు.
పవర్ హిట్టర్లైన షెపర్డ్, హోల్డర్ బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికించారు. లుంగిడి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో స్కోర్ వంద దాటించిన షెపర్డ్.. ఆ తర్వాతా బౌండరీలతో చెలరేగాడు. జాన్సెన్క చుక్కలు చూపిస్తూ హోల్డర్ 6, 4, 6తో రెచ్చిపోయాడు. ఎనిమిదో వికెట్‌కు అర్ధ శతకంపైగా భాగస్వామ్యం నెలకొల్పారు. 19వ ఓవర్లో ఎంగిడి స్లో బాల్స్‌తో షెపర్డ్‌ను కట్టడి చేసి ఒకే ఫోర్ ఇచ్చాడు. చివరి ఓవర్లో బాస్ సైతం పొదువుగా బౌలింగ్ చేసి హోల్డర్‌ను ఔట్ చేశాడు.. చివరి బంతికి ఫైన్ లెగ్‌లో బౌండరీ రావడంతో.. విండీస్ 176కే పరిమితమైంది.