MI vs KKR | తొలి బ్రేకిచ్చిన శార్థూల్.. బౌండరీలతో చెలరేగుతున్న రహానే..!
MI vs KKR : ఐపీఎల్ ఆరంభ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు దంచేశారు. టాస్ ఓడినా తగ్గేదేలే అంటూ అజింక్యా రహానే(36 నాటౌట్), ఫిన్ అలెన్(37) లు పోటాపోటీగా బౌండరీలతో వాంఖడేనే హోరెత్తించారు
MI vs KKR : ఐపీఎల్ ఆరంభ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు దంచేశారు. టాస్ ఓడినా తగ్గేదేలే అంటూ అజింక్యా రహానే(36 నాటౌట్), ఫిన్ అలెన్(37) లు పోటాపోటీగా బౌండరీలతో వాంఖడేనే హోరెత్తించారు. పాండ్యా ఓవర్లో 2 సిక్సర్లు, మూడు ఫోర్లతో రెచ్చిపోయిన ఈ ద్వయం స్కోర్ 50 దాటించింది. సునామీలా చెలరేగుతున్న ఈ జంటను శార్దూల్ ఠాకూర్ విడదీసి ముంబైకి బ్రేకిచ్చాడు. బౌండరీ లౌన్ వద్ద తిలక్ వర్మ సులువైన క్యాచ్ పట్టగా అలెన్ వెనుదిరిగాడు. దాంతో, పవర్ ప్లేలో కేకేఆర్ వికెట్ నష్టానికి 78 రన్స్ చేసింది.
టాస్ ఓడిన కోల్‌కతాకు ఓపెనర్లు అజింక్యా రహానే(36 నాటౌట్), ఫిన్ అలెన్(37) శుభారంభమిచ్చారు. వాంఖడేలో ముంబై బౌలర్లను బెంబేలెత్తిస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే సిక్సర్‌తో రహానే తన ఉద్దేశం చాటగా.. అరంగేట్రం కుర్రాడు ఘజన్ఫర్కు అలెన్ చుక్కలు చూపించాడు. హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్లో రెచ్చిపోయిన ఈ ద్వయం 26 పరుగులు పిండుకుంది.
A 𝗽𝗼𝘄𝗲𝗿-𝗽𝗮𝗰𝗸𝗲𝗱 start, courtesy of Finn Allen and Captain Ajinkya Rahane 💪
5⃣0⃣ up for #KKR inside 4 overs 🔥
Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR | @KKRiders pic.twitter.com/zChHXKLWXR
— IndianPremierLeague (@IPL) March 29, 2026
తొలి రెండు బంతుల్ని రహానే సిక్సర్లుగా మలచగా.. అలెన్ మూడు ఫోర్లతో చెలరేగాడు. ఈ జోడీని విడదీసేందుకు శార్దూల్ ఠాకూర్‌కు బంతి అందించిన కెప్టెన్ పాండ్యా ఫలితం రాబట్టాడు. సిక్సర్‌కు యత్నించిన అలెన్ బౌండరీ వద్ద తిలక్‌కు దొరికాడు. వీరిద్దరి వీరబాదుడుతో పవర్ ప్లేలో కోల్‌కతా 78 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

