గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 23:16:55

డిపీలు మార్చి కృతఙ్ఞతలు తెలిపిన సెలెబ్రిటీస్

డిపీలు మార్చి కృతఙ్ఞతలు తెలిపిన సెలెబ్రిటీస్

ముంబై : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ సల్మాన్ ఖాన్,అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్, కత్రినా కైఫ్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, మాధురి దీక్షిత్, షబానా అజ్మీ, విద్యాబాలన్, అర్జున్ కపూర్, అనన్య పాండే, సిధార్థ్ మల్హోత్రా చాధా , సోను సూద్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోని డిస్ ప్లే పిక్చర్ (డిపీ)లను మార్చారు. ట్విట్టర్,ఫేస్ బుక్ వంటి  తమ సోషల్ మీడియా ఖాతాల్లోని డిపీల్లో తమ ఫోటోలను తొలగించి మహారాష్ట్ర పోలీస్ లోగోను ఉంచారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా,క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి వంటి క్రీడా తారలు కూడా తమ డీపీల స్థానంలో మహారాష్ట్ర పోలీస్ లోగో  ను ఉంచారు. కరోనా మహమ్మారి కారణంగా మహారాష్ట్రలో ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విపత్తులు,దాడుల సమయంలో మహారాష్ట్ర పోలీసులు పౌరులకు అండగా నిలిచారు. ఇప్పుడు వీధుల్లో కరోనాపై యుద్ధానికి నాయకత్వం వహిస్తున్న ఈ సమయంలో, ట్విట్టర్, ఫేస్బుక్ ఇన్‌ స్టాగ్రామ్‌ లో నా డీపీని మహారాష్ట్ర పోలీసు లోగోకు మార్చడం ద్వారా వారికి కృతఙ్ఞతలు తెలపాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ ప్రయత్నంలో నాతో చేరండి" అంటూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.  షారూఖ్ ఖాన్ ఒక ట్వీట్‌లో "నేను మహారాష్ట్ర పోలీసులకు సంఘీభావం తెలుపుతున్నాను. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నిరంతరాయంగా కృషి చేసినందుకు అనిల్ దేశ్‌ముఖ్ , ముంబై పోలీసులకు ధన్యవాదాలు. కరోనా పోరాటంలో ముందువరుసలో నిలబడి ఫైట్ చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు చాలా కృతజ్ఞతలు" అని ట్వీట్ చేశారు.


logo