Mancherial | పెళ్లింట విషాదం.. కూతురు వివాహమైన కొన్ని గంటల్లోనే తండ్రి మృతి
Mancherial | బిడ్డ పెండ్లిచేసిన(Daughter marriage) సంతోషం ఆ తండ్రికి ఎంతో సేపు నిలువలేదు. కూతురి కాళ్ల పారాణి ఆరకముందే ఆ తండ్రి ఆయువు తీరింది.
మంచిర్యాల : బిడ్డ పెండ్లిచేసిన(Daughter marriage) సంతోషం ఆ తండ్రికి ఎంతో సేపు నిలువలేదు. కూతురి కాళ్ల పారాణి ఆరకముందే ఆ తండ్రి ఆయువు తీరింది. కూతురు వివాహమైన కొన్ని గంటల్లోనే తండ్రి గుండెపోటుతో(Heart attack) మృతి(Father died) చెందాడు. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల (Mancherial)జిల్లా చెన్నూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూర్ పట్టణంలోని మెయిన్ రోడ్లో ప్రిన్స్ కంగన్ హాల్-జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్న మహ్మద్ ఎజాజ్ ఆదివారం రాత్రి 8 గంటలకు తన పెద్ద కూతురు వివాహం జరిపించాడు.
ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు తన చాతిలో నొప్పి వస్తుందని ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి బయలుదేరాడు. అంతలోనే స్పృహ కోల్పోగా, వెంటనే దవాఖానకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బంధుమిత్రులతో సందడిగా మారిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఎజాజ్ మరణంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

