గురువారం 28 మే 2020
National - May 09, 2020 , 21:38:08

అక్కడివేమీ తినకూడదు... ఎందుకో తెలుసా ?

అక్కడివేమీ తినకూడదు... ఎందుకో తెలుసా ?


వైజాగ్ :విశాఖపట్నం జిల్లాలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో స్టెరీన్ గ్యాస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీక్ అయిన గ్యాస్ ప్రభావంతో 12 మంది చనిపోగా…వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. కొందరు కోలుకోగా…మరికొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉ న్నది. వెంకటాపురంతో పాటు పరిసర ప్రాంతాలలోని ఐదు గ్రామాల ప్రజలు రావద్దని నిపుణులు చెబుతున్నారు. అక్కడి వాతావరణంలో పాలిమర్ కారక విష రసాయనాలు ఉండటమే ఇందుకు కారణం.  ప్రస్తుతం అక్కడున్న పరిస్థితుల్లో కూరగాయాలు, ఆకుకూరలు, తినే పండ్లు, పెరట్లో చెట్లకు కాసిన కాయలు తినకూడదు. అలానే ఇంట్లో తెచ్చి పెట్టుకున్న కూరగాయాలు, మిగతా పదార్థాలు కూడ వాడకూడదు. కవర్ లో చుట్టిన వాటిని తప్ప..బయట  ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకూడదు .   మూత లేని  ట్యాంకుల్లో నీటిని వినియోగించకూడదు. పాలిమర్ నీటిలో కలిసిపోతున్నది. ఆ నీటిని తాగితే దుష్పప్రభావాలు తలెత్తే  ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  


logo