గురువారం 28 మే 2020
National - May 07, 2020 , 20:58:34

దుర్ఘటన కలచివేసింది: పవన్

 దుర్ఘటన కలచివేసింది: పవన్

అమరావతి : విశాఖపట్నంలో ఎల్‌జి పాలిమర్స్‌లో విష వాయువులు వెదజల్లడంతో చాలామంది ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది అస్వస్థతకి గురవడం కలచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సంఘటన లో మూగ  జీవాలు చనిపోవడం, దారి పొడవునా మనుషులు పడిపోవడం, పసి బిడ్డలు, ఆడవాళ్లు పడిపోవడం చాలా ఆవేదన కలిగించిందన్నారు. "మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ సమయంలో జనసైనికులు, జనసేన నాయకులు తెల్లవారు జామునే అక్కడకు వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం ఉపశమనం కలిగించిందని,. ఇదే స్ఫూర్తితో బాధితులకు అండగా నిలబడండి’ అంటూ పవన్ విజ్ఞప్తి చేశారు.


logo