Rahul Gandhi | న్యూఢిల్లీ: అదానీ షెల్ కంపెనీలకు చేరిన రూ.20వేల కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయని, ఈ సొమ్ము ఎవరిదని? కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. మోదీ సర్కార్‌ను ప్రశ్నించారు. అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు రాహుల్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ ఒత్తిడి తీసుకొస్తున్నదన్న బీజేపీ ఆరోపణలపై స్పందించాలని విలేకర్లు కోరగా, ‘బీజేపీ చెప్పిన విషయాల గురించి ఎందుకు అడుగుతున్నారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ.20వేల కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయన్నది నా ప్రశ్న. దీనికి సమాధానం కావాలి’ అని అన్నారు.