Reels | ప్రస్తుత సమాజంలో రీల్స్ (Reels) ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్లు ఉండటంతో.. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు. ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం..? అవేవీ పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువతి రీల్స్ చేస్తూ 13వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది.
యువతి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు బెంగళూరు (Bengaluru)లోని పరప్పన అగ్రహారా (Parappana Agrahara)లో నిర్మాణంలో ఉన్న ఓ భవంపైకి వెళ్లింది. పార్టీ మధ్యలో యువతి రీల్స్ కోసం టెర్రస్‌పైకి వెళ్లింది. అక్కడ వీడియో (filming reel) తీసుకుంటూ కాలుజారి 13వ అంతస్తు నుంచి కిందపడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన అనంతరం ఆమె స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు బీహార్‌కు చెందిన యువతి అని, నగరంలోని ఓ షాపింగ్ మార్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనను అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Shubhanshu Shukla | జీరో గ్రావిటీకి అలవాటు పడుతున్నా.. అంతరిక్షం నుంచి శుభాన్షు శుక్లా సందేశం
Congress Party | ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ లేఖ.. పోలింగ్ వీడియో ఇవ్వాలని డిమాండ్
Operation Sindhu | కొనసాగుతున్న ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి 3,426 మంది తరలింపు