Congress Party | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ ఓటర్ల జాబితా, పోలింగ్ రోజు నాటి వీడియో ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలకు సంబంధించి లేఖను పంపింది. మహారాష్ట్ర, హర్యానా ఓటర్ల జాబితాల డిజిటల్, మెషిన్-రీడబుల్ కాపీలను వారంలోగా అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ తన లేఖలో స్పష్టంగా పేర్కొంది. అలాగే, పోలింగ్ రోజు వీడియో రికార్డింగ్‌ను ఇవ్వాలని కోరింది. తమ డిమాండ్‌ను పరిష్కరించడం ఎన్నికల సంఘానికి కష్టమైన పనేం కాదని పేర్కొంది. తమ ఈ డిమాండ్ కూడా కొత్తదేం కాదని.. ఈ విషయంలో పార్టీ చాలాకాలంగా డిమాండ్ చేస్తుందని చెప్పారు.
రాజకీయ పార్టీల విశ్వాసాన్ని పెంచడమే కాకుండా, ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవాలని కోరింది. అయితే, పార్టీ అగ్రనాయకత్వ బృందం ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్ధంగా ఉందని కాంగ్రెస్ తెలిపింది. మొత్తం ప్రక్రియపై బహిరంగ చర్చ జరిగేలా విశ్లేషించడంతో పాటు ఆధారాలను కమిషన్ ముందుంచనున్నది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను బహిర్గతం చేసే డేటా, విశ్లేషణ తమ వద్ద ఉందని పార్టీ పేర్కొంది. మహారాష్ట్ర, హర్యానాలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఓటింగ్‌లో పారదర్శకత లేదంటూ ఆరోపిస్తూ వస్తున్నది.
Congress writes to the Election Commission in response to ECI’s letter to LoP Lok Sabha Rahul Gandhi, offering to meet and discuss the issues about the Maharashtra 2024 Vidhan Sabha election that he and the Congress party raised.
The letter reads, “We request you to provide us… pic.twitter.com/USOxfgdnTI
— ANI (@ANI) June 26, 2025