Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ (Israel-Iran) మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్, ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తోంది. పొరుగు దేశాలకు చెందిన పౌరులకు కూడా భారత్ ఆపరేషన్ సింధు ద్వారా సాయం చేస్తోంది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే పలువురు భారతీయులు స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఇరాన్‌లోని మషద్‌లో చిక్కుకున్న 272 మందిని భారత్ స్వదేశానికి తీసుకొచ్చింది. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానం నిన్న రాత్రి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో ముగ్గురు నేపాలీ (Nepalese) పౌరులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇరాన్ నుంచి తరలించిన వారి సంఖ్య 3,426కి చేరినట్లు వెల్లడించారు. ఇరాన్ నుంచి స్వదేశానికి చేర్చిన భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి ఇప్పటి వరకూ 818 మందిని కేంద్రం స్వదేశానికి తరలించింది.
Also Read..
Rajnath Singh | పహల్గాం ప్రస్తావన లేకుండానే ఎస్సీవో పత్రం.. సంతకం చేయని రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ మా హక్కు.. చైనా గడ్డనుంచే పాక్‌పై నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్
Bus Falls Into River | అలకనంద నదిలో పడిపోయిన బస్సు.. ఒకరు మృతి.. పలువురు గల్లంతు