బాలాసోర్: లెక్చరర్ వేధింపులు భరించ లేక 20 ఏండ్ల విద్యార్థిని ఆత్మాహుతి యత్నం చేసుకున్న ఘటన బీజేపీ పాలిత ఒడిశాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక ఫకీర్ మోహన్ కాలేజీలో బీఈడీ విద్యార్థిని నిప్పంటించుకుని ఆత్మాహుతి యత్నం చేసింది.
మహిళలకు రక్షణ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని బీజేడీ, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగా, ఆత్మాహుతి యత్నంతో తీవ్రంగా గాయపడిన బాధిత విద్యార్థిని భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.