Most Wanted Gangsters | విదేశాల్లో ఉంటూ భారత్‌లో నేర కార్యకలాపాలు సాగిస్తున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్ (Most Wanted Gangsters)ను ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు (Gangsters Arrested). వెంకటేష్ గార్గ్‌ను జార్జియాలో (Georgia) అరెస్ట్ చేయగా.. మరో గ్యాంగ్‌స్టర్ భాను రానాను అమెరికాలో (US) అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ ఆపరేషన్‌లో హర్యానా పోలీసులు కూడా భాగమయ్యారు. త్వరలో వీరిని భారత్‌కు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, అరెస్టైన వారిలో భాను రానాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉండటం గమనార్హం. బిష్ణోయ్ గ్యాంగ్‌లో అతడు కీలక సభ్యుడు. కర్నల్ ప్రాంతానికి చెందిన రానాపై చాలా కేసులు ఉన్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఇతడు నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక వెంకటేష్ గార్గ్‌పై దేశంలో 10కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ నేత హత్య తర్వాత జార్జియా పారిపోయాడు. అక్కడినుంచి ఇండియాలో తన నేర కార్యకలాపాలు సాగిస్తున్నాడు. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలనుంచి అనేకమంది యువకులను తన క్రిమినల్ నెట్‌వర్క్‌లో చేర్చుకున్నాడు. వారి సాయంతో ఇండియాలో నేరాలకు పాల్పడుతున్నాడు.
Also Read..
ISIS Terrorists | దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | ఓటు చోరీని కప్పిపుచ్చుకునేందుకే SIR : రాహుల్ గాంధీ
Passwords | 2025లో అత్యధికమంది వాడుతున్న కామన్ పాస్వర్డ్స్ ఇవే..