లక్నో: ఒక మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మూసి ఉన్న గది అంతా పొగలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఊపిరాడక ఆమె ఇద్దరు పిల్లలైన కుమార్తెలు మరణించారు. (Children Suffocate To Death) ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కైరానాలో నివసించే జస్సీ భార్య 30 ఏళ్ల అనిత గురువారం ఇంట్లోని బెడ్ రూమ్‌లో నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో మూసి ఉన్న ఆ గదిలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ఆ సమయంలో గదిలో ఉన్న అనిత ఇద్దరు కుమార్తెలైన పదేళ్ల వందన, ఏడాదిన్నర వయసున్న జస్ప్రీత్, పొగ కారణంగా ఊపిరాడక స్పృహ కోల్పోయారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలిన గాయాలైన అనిత, స్పృహ కోల్పోయిన ఆమె ఇద్దరు కుమార్తెలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వందన, జస్ప్రీత్ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పిల్లల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పోలీసులు తరలించారు. అనిత ప్రస్తుతం చికిత్స పొందుతోందని తెలిపారు.
మరోవైపు అనిత భర్త జస్సీ ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే కుటుంబ కలహాల కారణంగా అనిత నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
student rapes stepmother | సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడి.. గర్భవతిని చేసిన విద్యార్థి
Father Kills Daughter | సవతి సోదరుడి మార్క్‌షీట్‌ను మార్పు చేసిన బాలిక.. హత్య చేసిన తండ్రి