Massive Pile Up | దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. కాలుష్యానికి తోడు దట్టమైన పొగ మంచు (dense smog) కమ్మేసింది. దీంతో విజిబిలిటీ పడిపోయింది (low visibility). పొగ మంచు కారణంగా నోయిడా (Noida), యూపీ (Uttar Pradesh)లో ఇవాళ ఉదయం జరిగిన పలు వేర్వేరు ప్రమాదాల్లో (Massive Pile Up) ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు.
ఈస్టర్న్ ఫెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై తక్కువ దృశ్యమానత కారణంగా ఓ ట్రక్కు ముందు వాహనాన్ని ఢీ కొట్టింది. అదే సమయంలో పానిపట్ నుంచి మధురకు వెళ్తున్న బస్సు.. ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని దాదాపు 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇక ఆగ్రా సమీపంలోని ఫిరోజాబాద్ వద్ద ఓ పిక్అప్ ట్రక్‌ను దాదాపు ఆరు ఎస్యూవీ వాహనాలు వెనుక నుంచి ఒకదానికొకటి ఢీ కొట్టాయి. వ్యాను రోడ్డుపై నిలిచిపోవడంతో అదే సమయంలో వచ్చిన వాహనాలు విజిబిలిటీ తక్కువగా ఉండటంతో వెనుక నుంచి బలంగా ఢీ కొట్టాయి. ఈ ఘటనలో డజను మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సైఫాయి మెడికల్ కళాశాలకు తరలించారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై నసీర్పూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బులంద్‌షహర్ వద్ద వేగంగా వచ్చిన ట్రక్కు బైక్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా బదౌన్ సమీపంలో ఓ బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో పాఠశాల ఉపాధ్యాయుడు సంతోష్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ప్రాంతంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మరో పది మంది గాయపడ్డారు.
Also Read..
Parliaments Winter Session | శీతాకాల సమావేశాలకు ముందు.. 24న అఖిలపక్ష భేటీ
Meta | రూ.213 కోట్ల భారీ జరిమానా.. అప్పీల్‌కు వెళ్లనున్న మెటా