Agniveers | ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గురి తప్పిన తూటా.. ఇద్దరు అగ్నివీరులు మృతి
Agniveers | మహారాష్ట్ర నాసిక్ (Nashik)లో ఇద్దరు అగ్నివీరులు (Agniveers) ప్రాణాలు కోల్పోయారు. శిక్షణ సమయంలో ఫైరింగ్ (Firing Practice) చేస్తుండగా.. గురి తప్పి తూటాలు దూసుకెళ్లాయి.
Agniveers | మహారాష్ట్ర నాసిక్ (Nashik)లో ఇద్దరు అగ్నివీరులు (Agniveers) ప్రాణాలు కోల్పోయారు. శిక్షణ సమయంలో ఫైరింగ్ (Firing Practice) చేస్తుండగా.. గురి తప్పి తూటాలు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అగ్నివీరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
నాసిక్ జిల్లాలోని ఆర్టిలరీ సెంటర్ (Artillery Centre)లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సదరు అధికారులు తెలిపారు. ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో గురి తప్పి ఆ బుల్లెట్లు గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్ (21) శరీరంలోకి దూసుకెళ్లినట్లు చెప్పారు. అగ్నివీర్ బృందం వారిని వెంటనే డియోలాలిలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు అగ్నివీరులు తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై డియోలాలి క్యాంపు పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Also Read..
TikTok | ఉద్యోగులకు షాకిచ్చిన టిక్‌టాక్.. వందలాది మందిపై వేటు
Noel Tata | సవతి సోదరుడే.. రతన్ టాటా వారసుడయ్యాడు.. నోయెల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
Noel Tata | టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్ టాటా నియామకం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

