TikTok | ఉద్యోగులకు షాకిచ్చిన టిక్‌టాక్.. వందలాది మందిపై వేటు
TikTok | ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ (TikTok) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది.
TikTok | ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు కొలువుల కోత భయాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మొదలైన లేఆఫ్స్ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది. తొలుత మాంద్యం భయాలతో ఉద్యోగులను ఎడాపెడా పీకేసిన సంస్థలు.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ (TikTok) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సుమారుగా 700 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌లకు సంబంధించిన ఇ-మెయిల్స్ అందినట్లు తెలుస్తోంది. అయితే, టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ (ByteDance) మాత్రం ఈ లేఆఫ్స్ ప్రభావం 500 కంటే తక్కువ మంది ఉద్యోగులపైనే చూపిందని స్పష్టం చేసింది.
ఈ ఏడాది మేలో కూడా టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా కంటెంట్, మార్కెటింగ్ విభాగాల్లో ఈ తొలగింపులు జరిగాయి. త్వరలోనే మరో రౌండ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగనున్నట్లు సమాచారం. ఇక టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ నగరాల్లో 1,10,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
Also Read..
Noel Tata | సవతి సోదరుడే.. రతన్ టాటా వారసుడయ్యాడు.. నోయెల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
Noel Tata | టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్ టాటా నియామకం
Nara Rohit | పెళ్లి పీటలెక్కబోతున్న నారా రోహిత్.. ఆ హీరోయిన్‌తో మూడు రోజుల్లో నిశ్చితార్థం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

