Nara Rohit | టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ‘బాణం’ అంటూ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సోలో, రౌడి ఫెలో, ప్రతినిధి అంటూ తనకంటూ సెపరేట్ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. త్వరలో ‘సుందరకాండ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు.
సినిమాల్లో తన కంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ నారా వారి హీరో.. 40 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే త్వరలో నారా రోహిత్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్ ఓ హీరోయిన్ని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారంటూ ఒక వార్త టాలీవుడ్లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్గా చేసిన సిరి అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈనెల 13వ తేదీనే హైదరాబాద్‌లో వీరి ఎంగేజ్మెంట్ (Nara Rohit Engagement) ఉంటుందని టాక్. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబాలు హాజరవనున్నట్లు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.
ఇటీవల ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్ మరో క్రేజీ మూవీతో వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’ (Sundara Kanda). వృతి వాఘని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి , సునైనా, రఘు బాబు, అమృతం వాసు, అదుర్స్ రఘు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా.. ప్రదీష్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ. రోహన్ చిల్లాలే ఎడిటింగ్. ప్రొడక్షన్ డిజైన్: రాజేష్ పెంటకోట.
Also Read..
Shilpa Shetty | మనీలాండరింగ్ కేసు.. శిల్పాశెట్టి దంపతులకు ఊరట
Srinu Vaitla | రవితేజ సూపర్‌హిట్ వెంకీకి తర్వలో పార్ట్-2.. శ్రీనువైట్ల ఈసారి ఆ హీరోతోనే తీస్తారట
Pooja Hegde | పారితోషికం తగ్గించిన మంగళూరు భామ..