మహారాష్ట్ర/ బెంగళూరు/కేరళ : దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. శనివారం ఒకే రోజులు 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఎనిమిది, కర్ణాటకలో ఆరు, కేరళలో నాలుగు కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్రలో నమోదైన కొత్త కేసుల్లో ఆర్థిక రాజధాని ముంబైలో నాలుగు, సతారాలో మూడు, పుణే నగరంలో ఒక కేసు నమోదైంది. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 48కి పెరిగింది. కేరళలో నమోదైన నాలుగు కేసుల సంఖ్య మొత్తం సంఖ్య 11కు పెరిగింది.
కర్ణాటకలో ఇవాళ కొత్తగా ఆరు ఓమిక్రాన్ పాజిటివ్ కేసులు రికార్డవగా.. వీటిలో ఐదు దక్షిణ కన్నడ ప్రాంతంలోని రెండు వేర్వేరు విద్యాసంస్థల్లో గుర్తించినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ తెలిపారు. కొత్త కేసులతో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 14కు పెరిగింది. కొత్త వేరియంట్ బారినపడ్డ వారిలో ఇద్దరు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో వ్యక్తి దుబాయికి పారిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ఆయాక్టివ్ కేసులున్నాయి. ఇంతకు ముందు గురువారం ఒకే రోజు ఐదు కేసులు నమోదయ్యాయి.