కోటా : రాజస్థాన్‌లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్‌లోని షియోపూర్ నుంచి చాలా కాలం క్రితం కోటాకు వచ్చింది. నీట్-యూజీ పరీక్షకు ఆదివారం హాజరుకావలసి ఉండగా, శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తన గదిలో ఐరన్ గ్రిల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లేదు. కోటాలో ఈ ఏడాది జనవరి నుంచి వెలుగులోకి వచ్చిన ఆత్మహత్య కేసుల్లో ఇది 14వది. నిరుడు 17 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.